Pelli Chesukoni Ghantasala Lyrics

Album Name Pelli Chesi Choodu
Artist Ghantasala
Track Name Pelli Chesukoni
Music Ghantasala
Label Saregama
Release Year 1952
Duration 03:23
Release Date 1952-12-31

Pelli Chesukoni Lyrics

ఓ భావి భారత భాగ్య విధాతలార యువతి యువకులార
స్వానుభవమున చాటు నా సందేశమిదే
వరెవహ్
పెళ్ళీ చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలోయ్
కట్నాల మోజులో మన జీవితాలనె బలి చేసి
కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా
పట్నాల పల్లెల దేసె దేసాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖ పడగా
ఇంట బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్
ఇంట బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్
పెళ్ళీ చేసుకొని
పెళ్ళీ చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలోయ్

నవ భావముల నవ రాగముల
నవ జీవనమె నడపాలోయ్
నవ భావముల నవ రాగముల నవ జీవనమె నడపాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్
పెళ్ళీ చేసుకొని
పెళ్ళీ చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలోయ్
హాయిగ ఉండాలోయ్

Related Posts