Album Name | Bhaagya Rekha |
Artist | Pendyala Nageswara Rao |
Track Name | Neevunde Daa Kondapai |
Music | Pendyala Nageswara Rao |
Label | Saregama |
Release Year | 1957 |
Duration | 03:15 |
Release Date | 1957-12-31 |
Neevunde Daa Kondapai Lyrics
Lyricist: Devulapalli Krishnasastry
Singer: P.Suseela
నీవుండేదా కొండపై నా స్వామీ నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె ఈ పేదరాలి మనస్సెంతో వేచె
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె ఈ పేదరాలి మనస్సెంతో వేచె
నీ పాదసేవ మహాభాగ్యమీవా
ఆ పై నీ దయ జూపవా నా స్వామీ
నీవుండేదా కొండపై నా స్వామీ నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో
దూరాననైనా కనే భాగ్యముందా నీ రూపు నాలో సదా నిల్పనీవా
ఏడుకొండలపైనా ఈడైన స్వామీ నా పైన నీ దయ చూపవా నా స్వామీ
నీవుండేదా కొండపై నా స్వామీ నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో
ఏ పూల పూజింతునో