Neelagagana Ganasyama Ghantasala Lyrics

Album Name Chenchu Lakshmi
Artist Ghantasala
Track Name Neelagagana Ganasyama
Music S. Rajeswara Rao
Label Saregama
Release Year 1958
Duration 04:32
Release Date 1958-12-31

Neelagagana Ganasyama Lyrics

నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా
నీలగగన ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా
హాని కలిగితే అవతారాలను
హాని కలిగితే అవతారాలను పూని భ్రోచునదీ నీవేకావా
నీలగగన ఘనశ్యామా
నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా

చదువులు హరించి అసురండేగిన జలచరమైతివి ఆగమరూపా

వేద నిదులనే విధాత కొసగిన ఆదిదేవుడవు నీవే కావా
నీలగగన ఘనశ్యామా
నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా

కడలి మదించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి

అతివ రూపమున అమృతం గాచిన ఆదిదేవుడవు నీవే కావా
నీలగగన ఘనశ్యామా
నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా

సుజనుల కోసము ఎపుడే వేషము ధరియెంచెదవో తెలియగ నేరము

ఫెండ్లి కొడుకువై వెడలినాడవు ఎందులకొరకో
హే జగదీశా నీలగగన ఘనశ్యామా
నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా

క్షీరసాగరము వీడక నిరతము సిస్టుల రక్షణ దుష్టుల శిక్షణ

చిత్ర చిత్రముల రూపములొంది చేసే దైవము
శ్రీహరి ఒకడే నీలగగన ఘనశ్యామా
నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా
నీలగగన ఘనశ్యామా

సాహిత్యం: ఆరుద్ర

Related Posts