Album Name | Bhookailas |
Artist | R. Sudarsanam-R. Govardhanam |
Track Name | Neela Kandhara Devaa |
Music | R. Sudarsanam-R. Govardhanam |
Label | Saregama |
Release Year | 1958 |
Duration | 06:27 |
Release Date | 1958-12-31 |
Neela Kandhara Devaa Lyrics
జయ జయ మహాదేవా…
శంభో… సదాశివా…
ఆశ్రిత మందారా…
శృతి శిఖర సంచారా…
నీలకంధరా దేవా… దీన బాంధవా రారా… నన్ను గావరా…
నీలకంధరా దేవా… దీన బాంధవా రారా… నన్ను గావరా
సత్య సుందరా స్వామీ… నిత్య నిర్మలా పాహీ…
సత్య సుందరా స్వామీ… నిత్య నిర్మలా పాహీ…
నీలకంధరా దేవా… దీనబాంధవా రారా… నన్ను గావరా…
అన్య దైవమూ గొలువా… ఆ… ఆ…
అన్య దైవమూ గొలువా… నీదు పాదమూ విడువా.
అన్య దైవమూ గొలువా… నీదు పాదమూ విడువా
దర్శనమ్ము నీరా… మంగళాంగా గంగాధరా.
దర్శనమ్ము నీరా… మంగళాంగా గంగాధరా
నీలకంధరా దేవా… దీన బాంధవా రారా… నన్ను గావరా…
దేహి అన వరములిడు దాన గుణసీమా…
పాహి అన్నను ముక్తినిడు పరంధామ…
నీమమున నీ దివ్య నామ సంస్మరణ…
ఏమరక చేయదును భవ తాపహరణ…
నీ దయామయ దృష్టి దురితమ్ము లారా…
వరసుధా వృష్టినా వాంఛలీడేరా…
కరుణించు పరమేశ దరహాస భాసా…
హర హర మహాదేవ… కైలాస వాసా… కైలాస వాసా…
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా…
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా…
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా…
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా…
కన్నుల విందుగ భక్తవత్సల కానగరావయ్యా…
కన్నుల విందుగ భక్తవత్సల కానగరావయ్యా…
ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా…
ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా…
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా…
శంకరా శివ శంకరా అభయంకరా విజయంకరా…
శంకరా శివ శంకరా అభయంకరా విజయంకరా…
శంకరా శివ శంకరా అభయంకరా విజయంకరా…