Album Name | Missamma |
Artist | S. Rajeswara Rao |
Track Name | Baalanura Madanaa – 1 |
Music | S. Rajeswara Rao |
Label | Saregama |
Release Year | 1955 |
Duration | 03:17 |
Release Date | 1955-12-31 |
Baalanura Madanaa – 1 Lyrics
బాలనురా మదనా
బాలనురా మదనా
విరి తూపులు వేయకురా మదనా
బాలను రా మదనా
నిలచిన చోటనే నిలువగ నీయక ఆ
నిలచిన చోటనే నిలువగ నీయక
వలపులు కురియును రా
తీయని తలపులు విరియును రా మదనా
బాలనురా మదనా
విరి తూపులు వేయకురా మదనా
బాలను రా మదనా
చిలుకల వలే గోర్వంకల వలెనో ఓ
చిలుకల వలే గోర్వంకల వలెనో
కులుకగ తోచును రా
తనువున పులకలు కలుగును రా మదనా
బాలనురా మదనా
విరి తూపులు వేయకురా మదనా
బాలను రా మదనా
చిలిపి కోయిలలు చిత్తములో నేఏఏ
చిలిపి కోయిలలు చిత్తములో నే
కలకల కూయును రా
మనసును కలవర పరచును రా మదనా
బాలనురా మదనా
విరి తూపులు వేయకురా మదనా
బాలను రా మదనా